Committee Kurrollu | ఓట్లు కొనేసిన తర్వాత ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ, గొర్రెల్లా కాకుండా మంచిచెడులను విశ్లేషించుకొని ఓటు వేయాలనే సందేశంతో రూపొందిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదువంశీ దర్శకుడు. నిహారిక కొణిదెల సమర్పణలో శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
త్వరలో విడుదలకానుంది. ఇటీవలే ఈ సినిమాలోని ‘గొర్రెలా..’ అంటూ సాగే సెటైరికల్ గీతాన్ని జయప్రకాష్ నారాయణ్ విడుదల చేశారు. అనుదీప్‌దేవ్ స్వరపరచిన ఈ పాటను నాగ్ అర్జున్‌రెడ్డి రాశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. ఓటు విలువ తెలియజేస్తూ ఆలోచనాత్మకంగా ఈ పాటను రూపొందిచారని, యువత ఓటు వేసే సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలనే సందేశం ఉందని అన్నారు.