
హరితహారం ఉత్సవం కాదు.. ప్రతి ఒక్కరి బాధ్యత..
చింతకాని పర్యటనలో ఎంపీ నామా నాగేశ్వరరావు
చింతకాని, ఆగస్టు 19: ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. చింతకాని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణకుమారితో కలిసి గురువారం పూలు, పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హరితహారం ఉత్సవం కాదని, ప్రతిఒక్కరి బాధ్యతని అన్నారు. ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, ఎంపీడీవో రవికుమార్, ఎస్సై ప్రియాంక, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, సూపరింటెండెంట్ రాజ్యలక్షి, కార్యాలయ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.