
వడ్ల గింజల సాక్షిగా ఆ పార్టీ రాజకీయం
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి దేశ సంపద
మోదీ వచ్చాక మతోన్మాదంపై దృష్టి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి
ఖమ్మంలో ఆ పార్టీ శిక్షణ తరగతులు
ఖమ్మం, డిసెంబర్ 14: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుతం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని, వారికి ద్రోహం చేస్తోంది, వడ్ల గింజల సాక్షిగా బీజీపీ రాజకీయం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. రెండు రోజులపాటు జరిగే సీపీఐ సైద్ధాంతిక రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం ఖమ్మంలోని ఎంబీ గార్డెన్లో ప్రారంభమయ్యాయి. ఈ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ ప్రజలు పేదరికంలో, ప్రభుత్వాలు అప్పుల్లో ఉంటే కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ఆస్తులు మాత్రం కుప్పలుతెప్పలుగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం, కార్పొరేట్ సంస్థల ఆస్తులను పెంచడంపైనే దృష్టి కేంద్రీకరించారని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిషారం కోసం చేపట్టే ఉద్యమాలే పార్టీని బలోపేతం చేస్తాయన్నారు. సీపీ నాయకులు కూనంనేనిసాంబశివరావు, బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, సాబీర్‌పాషా, జమ్ముల జితేందర్ రెడ్డి, బందెల నర్సయ్య, దండి సురేశ్ పాల్గొన్నారు.
మార్క్సిజం అజేయం: ప్రొఫెసర్ యుగల్
మార్సిజం అజేయమని, అజరామరమని నాగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యగల్ రాయల్ అన్నారు. సీపీఐ శిక్షణ తరగతుల్లో ‘మార్సిజం – సమకాలిన సమాజంలో దాని ప్రాధాన్యం’ అనే అంశంపై ఆయన బోధించారు. ‘రాజకీయ అర్థశాస్త్రం – పరిచయం’ అనే అంశంపై బీవీఎస్ మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.