
భద్రాచలం/కొత్తగూడెం, ఆగస్టు 14: మాతా శిశు మరణాలు అరికట్టడం, మారుమూల ప్రాంతాల్లోని ఆవాసాలకు వైద్య సేవలు తీసుకెళ్లేందుకు ఆరోగ్య సామాజిక కార్యకర్తల సహకారం అవసరమని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం భద్రాచలం వైటీసీలో నిర్వహించిన సామాజిక ఆరోగ్య కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వైద్యం అందక ప్రాణాలు పోవడానికి వీల్లేకుండా సైనికుల్లా పనిచేయాలన్నారు. అనంతరం ఆరోగ్య కార్యకర్తలకు కిట్లు అందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారితో నృత్యం చేసి వారిని ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో సర్వేలెన్స్ ఆఫీసర్ చేతన్, కరోనా వ్యాక్సిన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.