
కొణిజర్ల, డిసెంబర్ 12 : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొణిజర్ల మండలంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దగోపతి గ్రామంలో నిర్మించిన కోదండ రామాంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ, దేవతల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాగశాల, ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొండవనమాల గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు గోసు సాయిబాబు, అరుణ దంపతులకు కొత్త వస్ర్తాలను బహూకరించారు. ఆయన వెంట మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఎంపీపీ గోసు మధు, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, వైరా మండల రైతుబంధు సమితి కన్వీనర్ మిట్టపల్లి నాగేశ్వరరావు, సర్పంచ్లు దాసరి దానియేలు, అమ్మడపూడి శిలవమ్మ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, తొండపునేని రామారావు, పొట్లపల్లి శేషగిరిరావు, ఏలూరి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి పరికపల్లి శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురభి వెంకటప్పయ్య, తాళ్లూరి చిన్నపుల్లయ్య, కొచ్చర్ల భిక్షం, ధరావత్ బాబూలాల్, ఎంపీటీసీలు బూరా ప్రసాద్, గుండ్ల కోటేశ్వరరావు, అంబేద్కర్, వింజం విజయ, సర్పంచ్లు అద్దంకి చిరంజీవి, రంగు సత్యనారాయణ, కాంపల్లి స్వప్న, మూడ్ సురేశ్, రాయల సత్యనారాయణ, మండల నాయకులు రచ్చా రామకోటయ్య, కొనకంచి మోష, తేజావత్ మదన్, పొట్లపల్లి జీడయ్య, కనగంటిరావు, కటుకూరి నరసింహారావు, షేక్ దాదాసాహేబ్, బొడ్డు నరసింహారావు, గదల నరేంద్రనాయుడు, కోసూరి సైదారావు, వడిత్యా రంగారావు, షేక్ జాన్పాషా, గూడూరి కృష్ణ, రెడ్డి నానయ్య, గోసు ఉపేందర్, రంజిత్, పెద్దగోపతి యూత్ పాల్గొన్నారు.