పాల్వంచ రూరల్, జూలై 17 : కిన్నెరసాని ఎగువ ప్రాంతాలైన ఇల్లెందు, బయ్యారం, టేకులపల్లి తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి వరద నీరు కిన్నెరసాని రిజర్వాయర్లో వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమేణా పెరుగుతున్నది.
వరద చేరికతో కిన్నెరసాని నిండుకుండలా కనిపిస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, బుధవారం రాత్రి 402.8 అడుగులకు చేరింది. ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. నీటిని విడుదల చేస్తున్నట్లు కిన్నెరసాని పరీవాహక ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేశారు.