
ఐదో రోజు అట్ల బతుకమ్మ సంబురాలు
పూల వనాలైన పల్లెలు, పట్టణాలు
ఖమ్మంలో బతుకమ్మ ఆడిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం/ ఖమ్మం కల్చరల్, అక్టోబర్ 10: ‘బతుకమ్మా.. బతుకమ్మా.. చల్లంగ చూడమ్మా..’ అంటూ ఆడబిడ్డలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తంగేడు, గునుగు, బంతి, గన్నేరు, చేమంతి, గుమ్మడి, ఆనప, బీర వంటి తీరొక్క పూలు పులకరించాయి. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం మహిళలు ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా అట్ల బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. రెండు జిల్లాల్లోని పల్లెలన్నీ పూలవనాలయ్యాయి. అట్ల బతుకమ్మ సందర్భంగా పెసర్లు, బియ్యంతో చేసిన అట్ల ను ప్రసాదంగా నివేదించారు. జీర్ణశక్తి, జ్ఞాపకశక్తిని పెంపొందించే ప్రసాదం ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగా ఎంతో ఉపయు క్తం కావడంతో పెసర అట్లను ప్రసాదంగా నివేదించి తమను చల్లంగా చూడాలని గౌరమ్మను ప్రార్థించారు.
తెలంగాణ భవన్లో..
టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయ ఆవరణలో ఐదో రోజూ బతుకమ్మ సంబురాలనునిర్వహించారు. ఖమ్మం 25వ డివిజన్లో మంత్రి అజయ్‌కుమార్ పాల్గొని మహిళలతో కలిసి నృత్యం చేస్తూ బతుకమ్మ ఆడారు. 53వ డివిజన్లో కార్పొరేటర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు. 22వ డివిజన్లో కార్పొరేటర్ పల్లా రోజ్లీనా మహిళలకు పూలను పంపిణి చేశారు. త్రీటౌన్‌లో ట్రాఫిక్ సీఐ అంజలి పాల్గొని ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బల్లేపల్లిలో కార్పొరేటర్ మలీదు జగన్మోహన్రావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఖమ్మం నగరంలో అర్బన్ తహసీల్దార్ శైలజ కూడా బతుకమ్మ ఆడారు.
డివిజన్లలో పాల్గొన్న మంత్రి
5వ డివిజన్ అల్లీపురం, 23వ డివిజ న్ శాంతినగర్, 25వ డివిజన్ కుమ్మరి బజార్, 28వ డివిజన్ సెయింట్ జోసెఫ్ స్కూల్, 30వ డివిజన్ పంపింగ్‌వెల్ రోడ్, 34వ డివిజన్ టీఆర్ఎస్ కార్యాల యం, 56వ డివిజన్ సాయిబాబా దేవా లయం, 4వ డివిజన్ వెంకటేశ్వరస్వామి దేవాలయం, 42వ డివిజన్ హనుమాన్ టెంపుల్, 21వ డివిజన్ జంగాల బజార్ తదితర ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి అజయ్ పాల్గొన్నారు.