
రూ.3.9 కోట్లతో రెండు కల్యాణ మండపాలు
రూ.84 లక్షలతో దుకాణాల సముదాయం
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ ప్రమాణం
పాల్వంచ రూరల్, అక్టోబర్ 10: పెద్దమ్మతల్లి ఆశీస్సులతో కొత్తగూడెం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు అన్నారు. పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. నూతన పాలక మండలి సభ్యులతో ఈవో శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు మాట్లాడుతూ రూ.2.21 కోట్లతో 700 సీట్ల సామర్థ్యం కలిగిన కల్యాణ మండపాన్ని, రూ.1.69 కోట్లతో 500 సీట్ల సామర్థ్యం కలిగిన మరో కల్యాణ మండపాన్ని మంజూరు చేయించామని, 90 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. రూ.84 లక్షల వ్యయంతో దుకాణాల సముదాయాన్ని మంజూరు చేయించామన్నారు. నూతన ఆలయ నిర్మాణానికీ సహకరిస్తానన్నారు. ఎమ్మెల్యే వనమాను నూతన పాలక మండలి సభ్యులు సన్మానించారు.
వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం..
పెద్దమ్మతల్లి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. పాత పాల్వంచలోని వనమా స్వగృహం నుంచి వందలాది బైకులు, కార్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఎమ్మెల్యే వనమా, ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు మహీపతి రామలింగం ఊరేగింపుగా పెద్దమ్మతల్లి దేవాలయం వరకు చేరుకున్నారు. కేశవాపురం నుంచి పెద్దమ్మతలి దేవాలయం వరకు టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు టీఆర్ఎస్ శేణులతో పాదయాత్రగా వచ్చారు.
నూతన పాలకవర్గ ప్రమాణం..
పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా మహీపతి రామలింగం, సభ్యులుగా ఎస్వీఆర్కే ఆచార్యులు, బేతంశెట్టి విజయ్, చింతా నాగరాజు, ముత్యాల ప్రవీణ్, ఆడెపు చిన వెంకట్రామయ్య, మాళోతు సువాలి, కాటారపు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరెడ్డి, గంధం వెంగళరావు, కిలారు నాగమల్లేశ్వరావు, బండి చిన్న వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, రైతుబంధు సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరావు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడి సరస్వతి, బాదావత్ శాంతి, భూక్యా సోనా, సర్పంచ్ అనిత, ఎంపీటీసీ ఉషారాణి, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేశ్, కొత్తగూడెం ఏఎంసీ చైర్మన్ భూక్యా రాంబాబు, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు మంతపూరి రాజూగౌడ్, మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.