
ప్రతిపక్ష నాయకులు కళ్లున్న కబోదులు
వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఉంది
రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి,పువ్వాడ అజయ్‌కుమార్
సత్తుపల్లిలో చిరుధాన్యాలు, తృణధాన్యాలతో సీఎం చిత్రపటం
ఖమ్మంలో హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో ..
సంబురాల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. ప్రజల నమ్మకం అని రాష్ట్ర వ్యవసాయ,
ఖమ్మం, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటించారు. ఖమ్మం నగరంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. వివిధ రకాల కూరగాయలతో తీర్చిదిద్దిన కేసీఆర్ చిత్రపటాన్ని పరిశీలించారు. సత్తుపల్లి మండలం నారాయణపురంలో ఎకరం విస్తీర్ణంలో చిరుధాన్యాలు, తృణధాన్యాల మొలకలతో రూపొందించిన రైతుబంధు అక్షరమాల, కేసీఆర్ చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండడంతో కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు భరోసా కలిగిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు కళ్లుండి కూడా అభివృద్ధిని చూడలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో, పాడిపంటల్లో, సాగునీటి బొట్టులో సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత బీజేపీదేనని విమర్శించారు.
రైతుబంధు పథకం చారిత్రాత్మకమని, సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రతి సీజన్లో పెట్టుబడి సాయం పొందుతున్నారన్నారు. పంటల పెట్టుబడి ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించిన మహా నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. నాలుగేళ్లలో ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.50 వేల కోట్లు రైతులకు అందజేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. కోట్లాది మంది రైతులను అదుకుంటున్న పథకం రైతుబంధు అన్నారు. విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటల మద్దతు ధర వరకు ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా ఆదుకుంటున్నదన్నారు.
మార్కెట్లో పండుగ వాతావరణం..
కూరగాయల మార్కెట్లో పండుగ వాతావరణంలో రైతుబంధు సంబురాలు జరిగాయి. 50 క్వింటాళ్ల కూరగాయలతో 1800 చదరపు అడుగులతో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్కెట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు, కళాకారుల కోలాట నృత్యం, డప్పు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మార్కెట్లో సీఎం కేసీఆర్ భారీ కటౌట్‌కు క్షీరాభి షేకం, పుష్పాభిషేకాన్ని స్థానికులు ఆసక్తిగా తిల కించారు. జై కేసీఆర్ అంటూ నినా దాలు చేశారు.
సీఎం కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. ప్రజల నమ్మకం అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రజల మద్దతు కేసీఆర్‌కే ఉందన్నారు. ఖమ్మం నగరంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో సోమవారం కూరగాయల వ్యాపారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. ఉత్తర భారతంలో రైతులు వ్యవసాయ చట్టాల రద్దు కోసం సుదీర్ఘకాలం పాటు ఉద్యమాలు చేశారన్నారు. ఐదు రాష్టాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసిందన్నారు. దశాబ్దాల పాటు జాతీయ పార్టీలు పాలించిన రాష్ర్టాల్లో రైతులు ఉద్యమిస్తుంటే, ఏడేండ్ల తెలంగాణలో రైతులు పండుగ చేసుకుంటున్నారన్నారు. దర్జాగా సాగు చేసుకుంటున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు భరోసా వచ్చిందన్నారు. ప్రతిపక్ష నాయకులు కళ్లుండి కూడా అభివృద్ధిని చూడడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో, పాడిపంటల్లో, సాగునీటి బొట్టులో సీఎం కేసీఆర్ కనపడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వ రరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ వీపీ గౌతమ్, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మార్కె టింగ్‌శాఖ జాయింట్ డైరెక్టర్ మల్లేశం, ఉప సం చాలకులు రాజు, సెక్రటరీ ఆర్.మల్లేశం, అసిస్టెంట్ సెక్రటరీ నిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, ఉద్యానశాఖ అధికారి సూర్యనారాయణ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పలువురు కార్పొరేటర్లు, పార్టీ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారుల అసోసియేషన్ అధక్ష్య, కార్యదర్శులు తోట రామారావు, గోళ్ల అవినాశ్, వ్యాపారులు పత్తి రవి, ఉస్మాన్తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతల జీవితాల్లో వెలుగులు
దమ్మపేట, జనవరి 10: తెలంగాణ వచ్చిన తర్వాత అన్నదాతల జీవితాల్లో వెలుగులు నిండాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం దమ్మపేట మండల పరిధిలోని మల్కారం సెంటర్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. ఉమ్మడి పాలనలో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. పంటలకు విద్యుత్ సరఫరా అందక నష్టపోయారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు సాగు సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం అందుతున్నదన్నారు. ఈసారి యాసంగి సాయమూ అందిందన్నారు. రైతులకు ముందే సంక్రాంతి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, పామాయిల్ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, ఏడీఏ అఫ్జల్‌బేగం, ఏవో శీలం చంద్రశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, కార్యదర్శి దొడ్డా రమేశ్, నాయకులు ఉమామహేశ్వరరావు, గుత్తా రాజా, వెంకట సత్యనారాయణ, యుగంధర్, గోపి, వాసు, ఏసుబాబు, కోటేశ్వరరావు, అచ్యుతరావు, నాగేశ్వరరావు, ప్రభాకర్, రమేశ్, యార్లగడ్డ బాబు పాల్గొన్నారు.
వైరా, జనవరి 10: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, రైతును రాజును చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వైరాలోని అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో మంత్రి అజయ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుల ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, వైరా, కొణిజర్ల ఎంపీపీలు వేల్పుల పావని, గోసు మధు, జడ్పీటీసీలు నంబూరి కనకదుర్గ, కవిత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వైరాలో..
వైరాలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో చైర్మన్ గుమ్మా రోశయ్య అధ్యక్షతన నిర్వహించిన రైతుబంధు వేడుకలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పాల్గొన్నారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. ఏడీఏ బాబురావు, వైరా, కొణిజర్ల వ్యవసాయ అధికారులు పవన్, బాలాజీతో పాటు మరికొందరిని సన్మానించారు.