
కూసుమంచి, జనవరి 10: తలసేమియా బాధితుల కోసం 250 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమని, ఈ రక్తం బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కూసుమంచిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రాత్రి వరకు జరిగిన రక్తదాన శిబిరంలో తాతా మధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలో ఏ ఒక్కరు మరణించినా వారి కుటుంబానికి ఎమ్మెల్యే కందాళ రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తూ వారికి అండగా ఉండడం ఎంతో మంచి విషయమని అన్నారు. పాలేరు ప్రజల గుండెల్లో కందాళ చిరస్థాయిగా నిలిచి పోతారని అన్నారు. అనంతరం డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి.. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని కొనియాడారు. జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, టీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, కూసుమంచి ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్, తిరుమలాయపాలెం ఎంపీపీ మంగీలాల్, ఎమ్యెల్యే కుమార్తె దీపిక మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కందాళ ప్రజా సేవకుడని ప్రశంసించారు. ఎమ్మెల్యే సతీమణి విజయ, టీఆర్ఎస్ నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, జడ్పీటీసీలు ఇంటూరి బేబి, వరప్రసాద్, ఎంపీపీలు బెల్లం ఉమ, వజ్జా రమ్య, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, మార్కెట్ చైర్మన్ సేట్రాంనాయక్, సుడా డైరెక్టర్ గుడా సంజీవరెడ్డి, కార్యదర్శులు ఆసిఫ్ పాషా, దేవేందర్ రెడ్డి, సీఏసీఎస్ అధ్యక్షుడు వాసంశెట్టి వెంటేశ్వర్లు, నలబోలు చంద్రారెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్లు బాణోత్ రాంకుమార్, అక్కినపల్లి వెంకన్న, చావా శిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.