సుబేదారి, జూన్ 4 : తనిఖీల్లో భాగంగా బుధవారం ఓ వాహనదారుడిని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు అతడి బైక్పై ఉన్న చలాన్లను చూసి నివ్వెరపోయారు. మూడేళ్లుగా సిగ్నల్ జంప్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న హనుమకొండకు చెందిన భిక్షపతి బైక్ టీఎస్ 03ఈఎస్ 9020పై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 109 పెండింగ్ చలాన్లు రూ. 26,310 ఫైన్ ఉన్నట్లు గుర్తించారు.
పెండింగ్ రసీదును భిక్షపతికి అందజేసి బైక్ను స్వాధీనం చేసుకున్నామని హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జీ సీతారెడ్డి తెలిపారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.