
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు
కొత్తగూడెం, సెప్టెంబర్ 9: పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని మనిషి ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన మానవతావాది కాళోజీ నారాయణరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు గురువారం కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు 107వ జయంత్యుత్సవాన్ని గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజలు, సాహిత్యాభిమానులు నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వనమా రాఘవేందర్రావు, కంచర్ల చంద్రశేఖర్‌రావు, కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, భూక్యా విజయలక్ష్మి, దామోదర్ యాదవ్, భూక్యా రాంబాబు, మండె వీరహన్మంతరావు, అన్వర్‌పాషా, భాగం మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 9: మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఎంపీపీ భూక్యా సోనా పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ సభ్యులు కొల్లు పద్మ, తేజావత్ భద్రమ్మ, తరాల రామ్మూర్తి, గుర్రం బాబురావు, భూక్యా స్వాతి, కార్యాలయ సూపరింటెండెంట్ అంకుబాబు పాల్గొన్నారు. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ నాగరాజు నివాళులర్పించారు. అధికారులు, సిబ్బంది రఘు, రాంబాబు, కనకలక్ష్మి, శేషమ్మ, వెంకటేశ్వర్లు, అనంతమ్మ, దుర్గమ్మ, మౌనిక, జకరయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు.
చుంచుపల్లి, సెప్టెంబర్ 9: ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన వేడుకలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ బాదావత్ శాంతి, ఎంపీడీవో సకినాల రమేశ్, ఎంపీవో సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు కూసన వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ, సెప్టెంబర్ 9: స్థానిక ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన జయంతి వేడుకలో ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 9: మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. కమిషనర్ అరిగెల సంపత్‌కుమార్, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్ అఫ్జల్ ఉన్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు.
రామవరం, సెప్టెంబర్ 9: సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన వేడుకలో జీఎం నరసింహారావు, అధికారులు రమేశ్, రఘురామిరెడ్డి, ఉజ్వల్ కుమార్ బెహ్రా, బుడగం రామకృష్ణ, కిరణ్‌బాబు, బుల్లి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 9: సింగరేణి హెడ్డాఫీస్లో జరిగిన వేడుకలో జనరల్ మేనేజర్లు కె.బసవయ్య, దామోదర్‌రావు, చంద్రశేఖర్, వెంకటరమణ, వెంకటేశ్వరరావు, సుబ్బారావు, సీఎంవోఏఐ కార్పొరేట్ అధ్యక్షుడు ఎంఆర్‌జీకే మూర్తి, టీబీజీకేఎస్ కార్పొరేట్ ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి పాల్గొన్నారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 9: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కాళోజీ చిత్రపటం వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ నివాళులర్పించారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 9: సింగరేణి మహిళా డి గ్రీ, పీజీ కళాశాలలో గురువారం ఐక్యూసీ, తెలుగు వి భాగాలు కాళోజీ జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించాయి. కాళోజీ చిత్ర పటానికి ప్రిన్సిపాల్ చింతా శారద పూలమాల వేసి నివాళులర్పించారు. కోఆర్డినేటర్లు మంజుల, స్వప్న పాల్గొన్నారు.
జూలూరుపాడు, సెప్టెంబర్ 9: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకలో ఎంపీపీ లావుడ్యా సోని, ఎంపీడీవో చంద్రశేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌడం నర్సింహారావు, నాయకుడు వేల్పుల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 9: వేడుకల్లో తహసీల్దార్ స్వామి, గిర్దావర్ రామయ్య, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.