
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఏర్పాట్లు పూర్తి చేసిన ఉభయ జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్
అర్హుల నిర్ధారణకు మూడంచెల కమిటీలు
విచారణ అనంతరం పట్టాల పంపిణీ
ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);పోడు భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ సర్కార్ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నది.. అందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది.. ఇప్పటికే ప్రతి పంచాయతీలో కమిటీలు ఏర్పాటు చేసిన సర్కార్ సోమవారం నుంచి పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది.. వాటిని మూడంచెల కమిటీలు పరిశీలించి చట్ట ప్రకారం పట్టాలు పంపిణీ చేయనున్నాయి.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుండడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన పోడు రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. సుదీర్ఘకాలం పాటు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వల్లాపురం గ్రామంలో మొత్తం 10,084 మంది జనాభా ఉన్నారు. ఇప్పటివరకు గ్రామానికి సీపీఎస్ నిధులు రూ.27.27 లక్షలు, ఎస్ఎఫ్సీ నిధులు రూ.21.42 లక్షలు పల్లె ప్రగతి మొదటి విడత నుంచి విడుదలయ్యాయి. ఈ నిధులతో అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనం జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. సువిశాలమైన స్థలంలో సుమారు రూ.4 లక్షల వ్యయంతో పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. మొత్తం వెయ్యి మొక్కలకు పైగా వనంలో పెంచుతున్నారు. ముఖద్వారాన్ని సుందరంగా అలంకరించారు. నగరాల్లో పార్కులకు ఉండే ముఖద్వారాల మాదిరిగా వల్లాపురం పల్లె ప్రకృతి వనం ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. జనాలు సేద తీరేందుకు బెంచీలతో పాటు, ఇతర ఏర్పాట్లను చేశారు. ఈ వనం గ్రామస్తులకు ఊరటను కలిగిస్తున్నది. అదేవిధంగా గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు సుమారు రూ.3 లక్షలతో మూడు సీసీ రోడ్లను నిర్మించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.20 లక్షలతో మరో నాలుగు సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం నిధులు రూ.10 లక్షలతో రెండు సీసీ రోడ్లను నిర్మించారు. గ్రామ పంచాయతీలో రూ.8.30 లక్షలతో ట్రాక్టర్, ట్రాక్టర్ ట్యాంకర్ కొనుగోలు చేశారు. ప్రతిరోజూ హరితహారం కింద గ్రామ పంచాయతీ పెంచుతున్న మొక్కలకు ట్యాంకర్ సహాయంతో నీరు పోస్తున్నారు.
ప్రతిరోజూ గ్రామంలో తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. దోమల నివారణకు ప్రత్యేకంగా రూ.76 వేలతో ఫాగింగ్ మిషన్‌ను కొనుగోలు చేసి నిరంతరం దోమల నివారణ మందును పిచికారీ చేస్తున్నారు. రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డు, సేంద్రియ ఎరువుల షెడ్‌ను నిర్మించారు. గ్రామంలోని ప్రధాన వీధుల పక్కనే ఉన్న ప్రహరీపై తడి, పొడి చెత్త సేకరణకు సంబంధించిన వాల్‌రైటింగ్ రాయించి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ గ్రామంలో అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు సహకరిస్తున్నారు.
పోడు భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. పోడు రైతులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సోమవారం నుంచి మొదలుకానున్నది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సర్కార్ కృషి చేస్తున్నది. పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయితీలో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో గ్రామ సభలు నిర్వహించింది. అధికారులు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వాటిని విచారించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత గ్రామ సభ తీర్మానంలో జాబితా సబ్ డివిజన్ స్థాయి కమిటీకి వెళ్తుంది. కమిటీ పరిశీలన తర్వాత నివేదిక కలెక్టర్ టేబుల్ పైకి వెళ్తుంది. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ వాటిని పరిశీలించి ఆర్వోఎఫ్ఆర్-2005 చట్టం ప్రకారం పట్టాలు జారీ చేయనున్నది.
ఉమ్మడి జిల్లాలో సమస్యలు ఇలా..
భద్రాద్రి జిల్లాలోని 21 మండలాల్లో పోడు భూముల సమస్య ఉండగా 2.29 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 865 గ్రామ ఆవాసాల్లో పోడు సమస్య తీవ్రంగా ఉన్నది. పోడు భూముల సమస్య పరిష్కారానికి సర్కార్ ఉభయ జిల్లాల్లో 800 సర్వే బృందాలు ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లాలో 10 మండలాల్లో పోడు భూముల సమస్య ఉన్నది. ఆయా మండలాల పరిధిలో 17,449 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీనిలో అధికంగా కారేపల్లి మండలంలో ఎక్కువగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 95 పంచాయితీల పరిధిలోని 125 ఆవాసాల్లో పోడు సమస్య తీవ్రంగా ఉన్నది.
ఇప్పటికే సమావేశాల నిర్వహణ..
పోడు భూముల సమస్యపై ఇప్పటికే ప్రభుత్వం జిల్లా అధికారులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత నెలలో ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోడు రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఏరియల్ సర్వేను అధ్యయనం చేశారు. ఒక్క పోడు రైతు కూడా మోసపోకూడదనే ఉద్దేశంతో వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నది. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు గౌతమ్, అనుదీప్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామస్థాయిలో పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ జరుగనున్నది. పోడు భూముల సమస్యల పరిష్కారానికి నోడల్ అధికారిగా భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు వ్యవహరించనున్నారు.
జిల్లాకే ఆదర్శం.. పల్లె ప్రకృతి వనం
వల్లాపురం గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. ముఖద్వారాన్ని నగరాల్లోని పార్క్‌లకు దీటుగా నిర్మించారు. సుమారు వెయ్యి మొక్కలు వనంలో పెంచుతున్నారు. జనం సేదతీరేందుకు వెదురుతో బెంచీలను ఏర్పాటు చేశారు. పిరమిడ్ ఆకారంలో నిర్మాణాలు చేపడుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తా.
-ఎన్.వెంకటపతిరాజు, ఎంపీడీవో , వైరా