
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం లో పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశం
ఖమ్మం, సెఫ్టెంబర్ 6: రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని తెలంగాణ భవన్లో జరిగిన ఖమ్మం పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరులోగా అన్ని కమిటీల నియామకం జరగాలన్నారు. టీఆర్ఎస్ కుటుంబంలో ఉండడం మన అదృష్టమని పేర్కొన్నారు.
పని చేసే వారికి పార్టీలో తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని అన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నెలాఖరులోగా అన్ని స్థాయుల కమిటీల నిర్మాణం చేసుకోవాలని సూచించారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన టీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ స్థాయి సన్మాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నిర్ణయం మేరకు పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి కార్యకర్తకీ పదవులు ఇచ్చి ఉన్నత స్థానం కల్పించడం తన బాధ్యత అని అన్నారు. క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారు మాత్రమే పార్టీ కమిటీలో ఉండాలని, సాధారణ సభ్యత్వం ఉన్న వాళ్లు అనుబంధ సంఘాల కమిటీల్లో ఉంటారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
60 లక్షలకు పైగా సభ్యులతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించడం సాధారణమైన విషయం కాదన్నారు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో 3 వంతుల సీట్లు సాధించి బలమైన పార్టీగా అభివృద్ధి చెందిందన్నారు. అందుకే ఇటీవల ఢిల్లీలో కూడా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. బూత్, గ్రామ స్థాయి సమస్యలపై స్పందించే వారిని, పార్టీని పటిష్టం చేసే వారిని పార్టీ బాధ్యులుగా చేసుకుంటామన్నారు. గ్రామ కమిటీల్లో అవకాశం రాని వారికి మండల కమిటీల్లో చోటు కల్పిస్తామన్నారు. టీఆర్ఎస్లో పనిచేయడం నిజంగా అదృష్టంగా భావించాలన్నారు. మన రోజువారీ పనులతోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణ పనులను కూడా అంతే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జి నూకల నరేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, డిఫ్యూటీ మేయర్ ఫాతిమా, జడ్పీటీసీ ప్రియాంక, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, కార్పొరేటర్లు, నగర నాయకులు పాల్గొన్నారు.