
కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు అవకాశం
నూతనంగా 53 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఈ నెల 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
కేంద్రాల వద్ద అందుబాటులో అధికారులు
ప్రకటించిన కలెక్టర్ వీపీ గౌతమ్
మామిళ్లగూడెం, నవంబర్ 1:ఖమ్మం జిల్లా ఓటర్ల ముసాయిదాను కలెక్టర్ వీపీ గౌతమ్ కలెక్టరేట్లో సోమవారం ప్రకటించారు.. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఓటర్ల జాబితాలో సంక్షిప్త సవరణలు చేశామన్నారు. ముసాయిదాపై ఈ నెల 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు.. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నదన్నారు. అందుకు గాను ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఖమ్మం నియోజకవర్గంలో 19, పాలేరులో ఆరు, మధిరలో 10, వైరాలో 11, సత్తుపల్లిలో 07 నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఖమ్మం జిల్లా ఓటర్ల ముసాయిదాను సోమవారం కలెక్టర్ వీపీ గౌతమ్ కలెక్టరేట్లో ప్రకటించారు.. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఓటర్ల జాబితాలో సంక్షిప్త సవరణలు చేశామన్నారు. ముసాయిదాపై ఈ నెల 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు.. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నదన్నారు. అందుకు గాను ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామన్నారు. నూతనంగా ఖమ్మం నియోజకవర్గంలో 19, పాలేరులో ఆరు, మధిరలో 10, వైరాలో 11, సత్తుపల్లి 07 నూతన పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు ఓటర్కార్డుల్లో తప్పుల సవరణ, పోలింగ్ కేంద్రం మార్పులు చేసుకోవచ్చన్నారు. బూత్ లెవల్ అధికారి లేదా తహసీల్దారు కార్యాలయాల్లో అర్జీలు పెట్టుకోవచ్చన్నారు. ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. బూత్ లెవల్ అధికారులందరూ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను డిసెంబర్ 20 లోపు విచారిస్తామన్నారు. తుది జాబితాను జనవరి 5న ప్రకటిస్తామన్నారు. రాజకీయ పార్టీలు అభ్యంతరాలను ఈ నెల 30 లోపు అందించాలన్నారు.