
రఘునాథపాలెం, అక్టోబర్ 19: ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్ధికి రూ.6 కోట్ల సుడా నిధులు కేటాయించినట్లు చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. గ్రామాల అవసరాల ప్రాతిపదికన సమస్యలను గుర్తించి ఈ నిధులను కేటాయించనున్నట్లు చెప్పారు. ఇందుకు కోసం మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రధాన సమస్యలను గుర్తిస్తున్నామన్నారు. మండల ప్రజాప్రతినిధులతో కలిసి శివాయిగూడెం, పువ్వాడ ఉదయ్‌నగర్, ఈర్లపూడి, పంగిడి, మంగ్యాతండా, కేవీ బంజర, మూలగూడెం, రజబ్ అలీనగర్, ఎన్వీ బంజర, దొనబండ, లచ్చిరాంతండా గ్రామాల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి అజయ్ ఆదేశాల మేరకు మండల అభివృద్ధి కోసం సుడా నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వీవీ పాలెం, రఘునాథపాలెం, మంచుకొండ, బల్లేపల్లి ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు నిమిత్తం రూ.6 కోట్ల కేటాయించామన్నారు. తాజాగా రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.4 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లోని ప్రధాన సెంటర్లలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు కోసం మరో రూ.2 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, మాజీ అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, ప్రధాన కార్యదర్శి తాతా వెంకటేశ్వర్లు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు బానోతు ప్రమీల, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు ధరావత్ రామ్మూర్తినాయక్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్, మొగిలిశెట్టి నరేష్, గుగులోతు శ్రీనివాస్, రంజీత్నాయక్, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గంధసిరి వీరభద్రం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.