కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 18 : వరంగల్‌లోని బొల్లికుంట ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజీ, కేయూ గ్రౌండ్స్‌లో ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు జరిగిన ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 40మంది విద్యార్థినులు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. కాకతీయ రీజియన్ స్థాయిలో జరిగిన పోటీల్లో మొత్తం ఆరు విభాగాలకుగాను మూడింటిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. బ్యాడ్మింటన్‌లో డి.శ్రీజ, ఆర్తి, అక్షిత, సుప్రియ, సుకన్య ద్వితీయ స్థానం, చెస్‌లో వినతి, కల్యాణి, కావ్యశ్రీ, కే.కావ్యశ్రీ, వి.మాధురి, కే.నవ్యశ్రీ ద్వితీయ స్థానం, టేబుల్ టెన్నిస్‌లో వెండి పతకం, హ్యామర్ త్రోలో బంగారు పతకం సాధిం చారు. బెంగుళూరు జైన్ యూనివర్సిటీలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో శ్రావణి, అ నూష పాల్గొన్నారు. వీరిని జీఎం (ఎడ్యుకేషన్) వెంకటేశ్వర్లు, కరస్పాండెంట్ నికోలస్, ప్రిన్సిపాల్ చింతా శారద, వ్యాయామ అధ్యాపకురాలు సావిత్రి అభినందించారు.