రఘునాథపాలెం, ఫిబ్రవరి 20: ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీభవ్య హాస్పిటల్‌ను ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అతి తక్కువ ఫీజుతో ఆధునిక వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. ఆధునిక టెక్నాలజీతో ఆసుపత్రిని ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేఎంసీ మేయర్ పునకొల్లు నీరజ, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బీ.కిషన్‌రావు, జనరల్ సెక్రటనీ డాక్టర్ టీ.సురేశ్, ఆసుపత్రి యాజమాన్య బాధ్యులు డాక్టర్ రవిప్రకాశ్, డాక్టర్ ఆర్.స్వప్న తదితరులు పాల్గొన్నారు.