
వైరా, సెప్టెంబర్ 7: ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ది ప్రథమస్థానమని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్క్‌ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. దేశం గర్వించేలా తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. దళితబంధు పథకం చరిత్రాత్మకమన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలతో పాటు ఇతర కమిటీలను త్వరితగతిన ఎన్నుకోవాలని సూచించారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతరాములు, వైరా, ఏన్కూరుల ఏఎంసీల చైర్మన్లు గుమ్మా రోశయ్య, భూక్యా లాలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.