బోనకల్లు/ కారేపల్లి, ఫిబ్రవరి 20: దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరారవు పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ఎన్నో రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు. బోనకల్లు, కారేపల్లి మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. తొలుత బోనకల్లు మండలం రావినూతల, జానకీపురం, బ్రాహ్మణపల్లి, రాయన్నపేట గ్రామాల్లో ఐదు సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రావినూతల రైతువేదికలో 26 మంది బాధితులకు మంజూరైన రూ.12 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం రావినూతల గ్రామంలో ఇటీవల మృతిచెందిన కొమ్మినేని సీతారావమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయా కార్యక్రమాల్లో ఎంపీ నామా మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడంలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ కక్ష కట్టి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ప్రత్యేకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్నారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు చేబ్రోలు మల్లికార్జునరావు, చిత్తారు నాగేశ్వరరావు, బొమ్మకంటి సైదులు, రంగిశెట్టి కోటేశ్వరరావు, బాణోతు కొండ, బంధం శ్రీనివాసరావు, వేమూరి ప్రసాద్, కాకాని శ్రీనివాసరావు, ఇటికాల శ్రీనివాసరావు, యనిగండ్ల మురళి, తమ్మారపు బ్రహ్మయ్య, తన్నీరు రవికుమార్, కొమ్మినేని ఉపేందర్, చిలకా వెంకటేశ్వర్లు, జెర్రిపోతుల రవీందర్, కిన్నెర వాణీ, జంగా రవికుమార్, తొండపు వేణు, వెంగళ కనకయ్య, సుధాకర్, ఎంపీటీసీలు కె.రాధ, చేపూరి సునీత, ఎం.సైదా, వి.కృష్ణ, ఎస్.సుధాకర్, కె.సుధాకర్, బి.తిరుపతిరావు, గ్రామఅధ్యక్ష, కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ : బోనకల్లు మండలంలో మోటమర్రిలో టీఆర్ఎస్ గ్రామ శాఖ, టీఆర్ఎస్ నాయకుడు తాళ్లూరి హరీశ్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పతాకాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఎగురవేశారు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ.. : తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. కారేపల్లి మండలంలోని నానూనగర్తండాలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌తో కలిసి ఎంపీ నామా ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన కనిపించిన వలస కూలీల వద్దకు ఎంపీ నామా వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలుంటే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందాలని సూచించారు. తెలంగాణ నుంచి వలస వెళ్లే స్థాయి నుంచి తెలంగాణకే ఇతరులు వలస వచ్చే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని అన్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, చిత్తారి సింహాద్రి, ముత్యాల సత్యనారాయణ, మాలోత్ శకుంతల, మల్లేల నాగేశ్వరరావు, తోటకూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.