ఖమ్మం/ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 19: ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 కుటుంబాలు సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు సమక్షంలో గులాబీ గూటికి చేరాయి. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారందరూ పార్టీ బలోపేతానికి తోడ్పడాలన్నారు. రూరల్ మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో తీర్థాల సర్పంచ్ తేజావత్ బాలూనాయక్, ఉప సర్పంచ్ రవికిరణ్, పొన్నెకల్ సర్పంచ్ సుదర్శన్, ఆత్మ కమిటీ డైరెక్టర్ వీరన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అక్కినేపల్లి వెంకన్న, సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్, నాయకులు రమణయ్య, మాచర్ల శ్రీను, ఉపేందర్, భూక్యా శంకర్, ధర్మసౌత్ వీరన్న పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట, సెప్టెంబర్ 19: ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేట మండల కేంద్రానికి చెందిన బీజీపీ, టీడీపీ, సీపీఐకి చెందిన 250 కుటుంబాలు సోమవారం టీఆర్ఎస్ నాయకులు దారా యుగంధర్, అబ్దుల్ జిన్నా, కౌలూరి నాగయ్య ఆధ్వర్యంలో తాటి సుబ్బన్నగూడెంలోని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్వగృహంలో టీఆర్ఎస్లో చేరాయి. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. తొలుత నాయకులు తాటి సుబ్బన్నగూడెం నుంచి దమ్మపేట వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. పార్టీలో చేరిన వారిలో పండూరి వీరబాబు, ఉయ్యాల లక్ష్మీనారాయణ, ఎస్కే బాజీ, గార్లపాటి వెంకన్నబాబు, కొర్సా వెంకటేశ్, భూక్యా రాజు, డొక్కా గోపి, పాశం రవి, కాకాని వెంకన్న, బొమ్మకంటి మల్లేశ్వరరావు, రౌతు సురేశ్, కాకాని గణేశ్, రామిశెట్టి రాజా, కొత్తపల్లి కిరణ్, యార్లగడ్డ సాయికిరణ్, యార్లగడ్డ ప్రవీణ్, కౌలూరి మోహనరావు, రాయపాటి చంద్రకాంత్, తిమ్మరాజు శ్రీను, జొన్నమాటి వెంకటేశ్వరరావు, తాళ్ల సాయికృష్ణ, సజ్జా స్వామి, చాట్ల నాగేశ్వరరావు, బొమ్మకంటి చెన్నారావు, నాగేంద్రరెడ్డి, కౌలూరి పండు, సోడెం వెంకటేశ్వరరావు, రెడ్డి నాగులు, సున్నం దారప్ప, సొడెం నాగేశ్ ఉన్నారు.