Peddapally | పెద్దపల్లి రూరల్ ఫిబ్రవరి 12 : గ్రామంలో నడుస్తున్న బెల్ట్ షాపుల మూలంగా సామాన్య కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వాటిని మూసేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సర్పంచ్ బండారి త్రివేణికి గ్రామయువకులంతా వినతి పత్రం సమర్పించారు.
ఈ మేరకు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సమావేశమైన యువకులంతా మద్యం అమ్మకాలు, బెల్టు షాపుల అంశంపై చర్చించుకుని పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని సర్పంచ్ త్రివేణికి అప్పగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ త్రివేణి మాట్లాడుతూ గ్రామస్తుల అభిప్రాయం మేరకు త్వరలో జరుగనున్న గ్రామసభ, పాలకవర్గ సమావేశంలో తీర్మాణం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు, యువత కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.