వెల్గటూర్, మే 11: మంచినీళ్లు తెచ్చుకునేందుకు స్కూటీపై వాటర్‌ప్లాంట్‌కు వెళ్తూ రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో హనుమాన్ మాలధారుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం వెల్గటూర్ మండలం రాజాక్కపల్లి గ్రామానికి చెందిన దొరిశెట్టి నిక్షిత్ (18), పత్తిపాక కీర్తిచంద్ర (హనుమాన్ దీక్షాపరులు) ఆదివారం తమ గ్రామం నుంచి శాఖాపూర్లోని వాటర్ ప్లాంట్‌లో మంచినీళ్లు తెచ్చుకునేందుకు స్కూటీపై బయలుదేరారు.
ప్లాంట్ రాగానే స్కూటీని స్లో చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో ధర్మపురి నుంచి కరీంనగర్‌కు బైక్‌పై వెళ్తున్న ఇల్లంతకుంట వెల్దిపురానికి చెందిన వేములవాడ శ్రీనివాస్, బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన అన్నాజీ విక్రం వచ్చి బలంగా ఢీకొట్టారు. స్థానికులు, కుటుంబ సభ్యులు వచ్చి నలుగురు క్షతగాత్రులను కరీంనగర్ దవాఖానకు తరలిస్తుండగా, తలకు తీవ్రగాయాలైన దొరిశెట్టి నిక్షిత్ మార్గమధ్యలో మృతి చెందాడు.