woman suicide | ఎల్లారెడ్డిపేట, మే, 14 : అనారోగ్యం కారణంగా గొల్లపల్లికి చెందిన ముద్ర కూల అంజని (19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. అంజలి గత కొంతకాలంగా మూర్చ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. పలు హాస్పిటల్లలో చికిత్స చేయించుకున్నప్పటికీ నయం కాకపోవడంతో మనస్థాపానికి లోనైంది.
దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా అంజలిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కాగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. కాగా మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.