Road Accident | కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 8 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపెళ్లి గ్రామానికి చెందిన జక్కుల సాయి కృష్ణ(22) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో తారుపల్లిలో విషాధం నెలకొంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సాయి కృష్ణ కారులో హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా కోహెడ మండలం శంకర్ నగర్ శివారులో ఇటుక బట్టీల సమీపంలో రాజీవ్ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
రహదారి పక్కన ఆగి ఉన్న స్విఫ్ట్ కారును సిద్దిపేట నుండి కరీంనగర్ వైపు వస్తున్న స్కార్పియో వాహనం వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సాయి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తండ్రి ఓదెలు, తల్లి రమ ఉన్నారు. సాయికృష్ణ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి తరలి వెళ్లారు.