Yoga | పెద్దపల్లి, జూన్2 1: మనిషి అరోగ్యంగా ఉండాలంటే యోగా నిత్య జీవితం భాగం చేసుకోవాలని డీసీపీ కరుణాకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ, మానసిక ఒత్తిడి తగ్గించటం, శారీరక దృఢత్వానికి యోగా ఎంతోగా ఉపయోగపడుతుందన్నారు.
యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చుని తెలిపారు. అసంక్రమిత వ్యాధులు రాకుండా, మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రతి రోజు యోగా చేయాలని కోరారు. . అనంతరం యోగ సేవలు అందించిన ఉద్యోగులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్, రామచంద్ర మిషన్ ప్రతినిధి అంజనా దేవి, పతంజలి యోగా సభ్యురాలు మమత, జిల్లా ఆయుష్ ఇన్చార్జి డాక్టర్ అరుణ, వైద్యలు, రెడ్ క్రాస్, రామచంద్ర మిషన్ యోగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఐఎంఏ ఆధ్వర్యంలో…
పెద్దపల్లి ఐఎంఏ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ కార్యలయంలో శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్, సీఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణ్ రావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమాకాంత్, కార్యదర్శి డాక్టర్ ప్రణీత్, కోశాధికారి డాక్టర్ స్వరూప్, వైద్యులు లీలావతి, విజయ, శ్రీదేవి, మల్లేశం, లక్ష్మణ్‌రావు తదితరులు యోగా మాస్టర్ సత్యనారాయణ సూచనలతో యోగా చేశారు.