జీవో జారీ చేసిన ప్రభుత్వం
హామీ నిలబెట్టుకున్న మంత్రి కొప్పుల
వెల్గటూర్, జూలై 24: ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఎండపల్లి ప్రజల కల నెరవేరింది. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం జీవో జారీ చేశారు. ఇందులో భాగంగా వెల్గటూర్ మండలం ఎండపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తూ 12 రెవెన్యూ గ్రామాలైన ఎండపల్లి, కొండాపూర్, గుల్లకోట, కొత్తపేట, గొడిసెలపేట, శానబండ, పాతగూడూర్, సూరారం, పడకల్, ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండెడతోపాటు మరో రెండు గ్రామాలు రాజారాంపల్లి, చెర్లపల్లిని కలిపి 14 గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటు చేశారు.
హామీ నిలబెట్టుకున్న మంత్రి కొప్పుల
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన నుంచి నూ తన మండలం ఏర్పాటు చేయాలని ఎండపల్లి-రాజారాంపల్లి సమీప గ్రామాల ప్రజలు డిమాం డ్ చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో అప్పుడు చీఫ్‌విప్‌గా ఉన్న నేటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కొప్పుల హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించారు. ప్రతిపాదనలతో వెళ్లి సీఎంను ఒప్పించి నూతన మండల ఏర్పాటుకు కృషి చేసి హామీ నిలబెట్టుకున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ముంజంపల్లి, మారేడుపల్లి, చెర్లపల్లి తదితర గ్రామాల నుంచి వెల్గటూర్ మండల కేంద్రానికి వెళ్లాలంటే 15-20కిలో మీటర్ల దూరం ప్రయా ణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఎండపల్లిని మండలం చేయడంతో దూరభారం తగ్గనుందని ఆ యా గ్రామాల ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు.
చిరకాల వాంఛను నెరవేర్చారు
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ మా చిరకాల వాంఛను నెరవేర్చారు. ఎండపల్లిని మండల కేం ద్రంగా ఏర్పాటు చేస్తాన ని మాట నిలబెట్టుకు న్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– మారం జలేందర్‌రెడ్డి, సర్పంచ్, ఎండపల్లి
హామీని నిలబెట్టుకున్న కొప్పుల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ఎండపల్లిని మండలం చేయాలని కోరుతున్నం. గత ఎన్నికలపుడు మంత్రి కొప్పుల ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నరు. తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కృతజ్ఞతలు.
– ఏలేటి కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్
పాలనా సౌలభ్యం కోసమే..
2018 ఎన్నికల్లో ఎం డపల్లిని మండలంగా ఏ ర్పాటు చేస్తానని హామీ ఇచ్చాను. ప్రతిపాదనలు తయారు చేయించి సీఎం కేసీఆర్‌కు విన్నవించాను. పాలనా సౌలభ్యం కోసం ఎండపల్లిని మండలం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
– కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి