Dharmapuri | ధర్మారం, మే 5 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను చేపట్టారు. గత నెల 29 నుంచి ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. తొలి రోజు దేవుడి గంగ స్నానంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 30 తో పాటు ఈనెల 1న జోగు తిరగడం, మూడు నా బొడ్రాయి అభిషేకం, పోచమ్మ బోనాలు, 4న పుట్టదని, లందకపోవుట, ఎల్లమ్మ బోనాలు, సుంకు పుట్ట కార్యక్రమాల నిర్వహించారు.
ఉత్సవాల ముగింపు రోజున ఎల్లమ్మ గుడి వద్ద పట్నాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పంబాల పూజారులు ఎల్లమ్మ దేవత జీవిత చరిత్ర గురించి కథ చెప్పారు. అనంతరం భక్తులు గుడిలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గౌడ సంఘం అధ్యక్షుడు పాలకుర్తి రాజేశం గౌడ్, ఉపాధ్యక్షుడు తోడేటి తిరుపతి, కుల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.