Kappathalli games | సుల్తానాబాద్ రూరల్ జూన్ 19: వర్షాలు పడకపోవడంతో రైతులు పంటల సాగు కు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులందరూ కలిసి వరుణ దేవునికి పూజలు నిర్వహించారు. కప్పల పెళ్లిలు చేసి ఇంటింటా తిరిగి కప్పతల్లి ఆటలాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దికుంట గ్రామంలో గురువారం గ్రామస్తుల ఆధ్వర్యంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ,ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కప్పతల్లి ఆటలు ఆడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లగా మహిళలు జలాభిషేకం చేశారు. అనంతరం గ్రామదేవతలకు హనుమాన్ ఆలయంలో ,పెద్దమ్మ తల్లి కి పోచమ్మ తల్లికి ,బొడ్రాయి, గ్రామ దేవతల తో పాటు తదితర దేవతలకు గ్రామస్తులు జలాభిషేకం చేసి వర్షాలు కురవాలని దేవుని వేడుకున్నారు . ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి, గ్రామస్తులు రవీందర్ రెడ్డి ,సతీష్, నరసయ్య , స్వామి ,తిరుపతి రెడ్డి ,వెంకట్ రెడ్డి ,రవీందర్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.