peddpally | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 25: ప్రపంచ మలేరియా దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పీహెచ్సీ సిబ్బంది, గ్రామ ప్రజల తో కలిసి గర్రెపల్లి గ్రామ పుర వీధులలో దోమల నివారణ, నిర్ములనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త లు తదితర అంశాలపై ప్రజలకు అవగాహనా కల్పించారు.
అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యాధికారి ఉదయ్ కుమార్ మాట్లాడుతూదోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, బోధ కాలు ( పైలేరియా) మొదలగు వ్యాధులు కలుగచేస్తాయని ఇంటిపరిసరాలలో లేకుండా చూసుకోవాలనీ, ప్రతీ శుక్రవారం డ్రైడే గా పాటించాలని గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్స్, ఏఎన్ఎంలు, పీహెచ్సీ సిబ్బంది. ఆశ కార్యకర్తలు.గ్రామ ప్రజలు పాల్గొన్నారు.