జగిత్యాల : పెన్షనర్ల (Pensioners) సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ (MLA Dr. Sanjay Kumar) అన్నారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ సంఘ కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షనర్లు సమాజ మార్గదర్శకులని, వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న హరి అశోక్ కుమార్, హన్మంత్ రెడ్డి, బొల్లం విజయ్, గౌరిశెట్టి విశ్వనాథం, ఎండి యాకూబ్, తదితరులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి పిసి హన్మంత్ రెడ్డి, సహాయ అధ్యక్షుడు బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు, ఎండి యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సయ్యద్ యూసుఫ్, సంయుక్త కార్యదర్శులు దిండిగాల విఠల్, కట్ట గంగాధర్, ఎండి ఇక్బాల్, జాఫర్, యాకూబ్ హుస్సేన్, మల్యాల అధ్యక్షుడు ఎండి యాకూబ్, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, మెట్ పల్లి అధ్యక్షుడు వి ప్రభాకర్ రావు, రాయికల్ అధ్యక్షుడు వై.వేణుగోపాల్ రావు, ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.