Alugunur | తిమ్మాపూర్,ఫిబ్రవరి17: కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదో డివిజన్ అలుగునూర్ కార్పొరేటర్ గా నూతనంగా ఎన్నికైన కాల్వ మల్లేశం ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అలుగునూర్లో ఘనంగా సన్మానించారు. అల్గనూరు చరిత్రలో అధిక మెజారిటీలో గెలుపొందడం హర్షణీయమన్నారు.
అల్గునూరు ప్రజలు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటారని గుర్తు చేశారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మల్లేశం గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నాయకులు సింగిరెడ్డి సమిరెడ్డి, సల్ల మహేందర్, డివిజన్, మండల నాయకులు పాల్గొన్నారు.