Wonder Book Record | కమానౌచౌరస్తా, జూలై 24 : కరీంనగర్ నగరంలోని కళాభారతితో ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రూప్, సల్వాజి ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, కళారవళి సోషియో కల్చరల్ ఆసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక భజన ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు దక్కింది. ఉమ్మడి పది జిల్లాలకు చెందిన 1000 మంది కళాకారులు 10 గంటల పాటు నిర్విరామంగా భజనలు చేసి రికార్డు కైవసం చేసుకున్నారు.
ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్, డాక్టర్ వేణుకుమార్ రికార్డులో పేరు నమోదైనట్లు ప్రకటించి ధృవ పత్రాన్ని, జ్ఞాపికను నిర్వాహకులకు అందజేశారు. ఉదయం ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హాజరయ్యారు. ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరిం చారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రౌప్ ఫౌండర్ సల్వాజి ప్రవీణ్, కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ అదతుడు డాక్టర్ విష్ణుదాసు గోపాల్ రావు, రఘుకుల తిలక పాట సృష్టికర్త కొండల స్వామి తదితర పాల్గొన్నారు.