Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 11: మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో జనవరిలో జరిగిన రంగోలి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ గురువారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు కుటీర పరిశ్రమలను నెలకొల్పి ఉపాధిని పొందే అవకాశం పొందవచ్చని అన్నారు. ప్రభుత్వం ద్వారా మహిళలకు రాయితీతో కూడిన రుణాలను అందజేస్తున్నట్లు చెప్పారు.
మహిళలు ఐకెపి సంఘాల ద్వారా పొదుపులు చేసుకొని వడ్డీ లేని రుణాలను పొందవచ్చనీ అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసీల్దార్ ముద్దసాని రమేష్, సర్పంచ్ ఆకవరం భవాని, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మార్క రాజ్ కుమార్, సెర్ఫ్ ఏపిఎం రజిత, విజయలక్ష్మి మండల సమాఖ్య పాలకవర్గ సభ్యులు రజిత, అరుణ, స్వప్న, సీసీలు రాజేశం, సత్యనారాయణ, వెంకటేష్, రమేష్, వీవోఏలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.