గోదావరిఖని, మే 25: కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చందర్ పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ ని యోజకవర్గ విసృతస్థాయి సమావేశానికి హాజరై, ఆయన మాట్లాడారు.
ఎన్నికల ముందు అడ్డగోలు మాటలు చెప్పి, అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభు త్వం, పాలనలో ఫెయిల్ అయిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం, హామీలపై నిలదీస్తున్న ప్రజల దృష్టిని మరల్చేందుకే కాళేశ్వరం పేరిట కొత్త డ్రామాలు ఆడుతున్నదని దుయ్యబట్టారు. డైవర్షన్ చేసేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నేత హరీశ్‌రావుకు నోటీసులు ఇస్తున్నదని దుయ్యబట్టారు.
రామగుండంలోనూ ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరిట కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా, సమస్యలు పరిష్కరించేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు, గు లాబీ సైన్యం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
రాబోయే రామగుండంలో పార్టీని మరింత బలోపేతం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషిచేయాలని సూచించారు. అలాగే పలు అంశాలపై సమావేశంలో తీర్మానించారు. ఇక్కడ రామగుండం మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు గోపు ఐలయ్యయాదవ్, నడిపెల్లి మురళీధర్‌రా వు, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, ముదాం శ్రీనివాస్, పర్లపల్లి రవి, కవితా సరోజని, కాల్వ శ్రీనివాస్, ఈదునూరి పర్వతాలు, ఆనంద్ ఉన్నారు.