మంథని, ఫిబ్రవరి 9: ‘బీఆర్ఎస్ ఆవిర్భావంతో బీజేపీలో భయం మొదలైంది. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పు తూ కక్ష సాధిస్తున్నది.’ అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధూకర్ విరుచుకుపడ్డారు. కవితను ఈడీ విచారణకు పిలువడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె ఢిల్లీలో తలపెట్టిన దీక్షను చూసి భయపడే కక్ష సాధిస్తున్నదని విమర్శించారు. మంథని రాజగృహలో గురువారం భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు హర్షిణీరాకేశ్తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేసేందుకే దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నదని మండిపడ్డారు.
కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను ఇబ్బందిపెడుతున్నదన్నారు. ధరల పెంపుతో ప్రజలపై దాడి చేస్తున్నదని మండిపడ్డారు. గతంలో కూడా అనేక ఇబ్బందులకు గురి చేసినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో ఈడీని అడ్డంపెట్టుకొని కక్షసాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపించిన మోదీ, అమిత్‌షా ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. బీజేపీకి భవిష్యత్‌లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని చరిత్ర చెబుతున్నదని, అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని కేంద్రం సూచించారు. అంతేగానీ, అధికారం బలంతో ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ ఇలా కక్ష్య సాధింపు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎగోలపు శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు నియోజకవర్గంలోని మహిళలందరం అండగా నిలుస్తం. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఆమె చేపడుతు న్న దీక్షకు భయపడే కేంద్రంలోని బీజేపీ సరారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఈడీ పేరిట భయబ్రాంతులకు గురి చేస్తున్నది. బీజేపీ సరారు తీరును మేం తీవ్రంగా ఖండిస్తున్నం. అయినా బీజేపీ కుట్రపూరిత వ్యవహరాలకు భయపడం.
– భూపాపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణీరాకేశ్