కలెక్టరేట్, జనవరి 9: ‘ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వ పథకాలను వివరిస్తాం. నగరంలో భారత రాష్ట్ర సమితి మరింత బలోపేతానికి కృషి చేస్తాం’ అంటూ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై తిరిగి గులాబీ జెండాను ఎగురవేస్తామని, మంత్రి గంగుల కమలాకర్‌ను నాలుగోసారి అఖండ మె జార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ 37వ డివిజన్లోని మీ సేవా కార్యాలయంలో పార్టీ నగర కమిటీ సభ్యులతో కలిసి సో మవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి గం గుల సూచనలు తు.చ. తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తామన్నారు. ఇప్పటికే నగరంలోని 42 డివిజన్లలో కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని, ఈసేవలను 60 డివిజన్లకు విస్తరిస్తామన్నారు. త్వరలోని పార్టీ మ హిళా, మైనార్టీ, బీసీ,ఎస్సీ, సోషల్ మీడియా కమిటీలు నియమిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వచ్చే సా ధారణ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానం నుంచే విజయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కార్యకర్తలను కలుపుకొని వెళ్లి పా ర్టీని ముందుకుతీసుకెళ్తామని పేర్కొన్నారు. నగరం లో 50వేల మందికి పైగా పార్టీ సభ్యత్వం అందించినట్లు, నాలుగేండ్ల నుంచి సభ్యత్వ నమోదులో కరీంనగర్‌ను ముందువరుసలో నిలిపామని చెప్పారు. సర్కారు పథకాలను చూసి యువత, మేధావులు, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
ప్రజలకు నీళ్లు, నిధులు అందించి నియామకాలు చేపట్టి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చిన బీఆర్ఎస్కే ఓటడిగే హక్కు ఉన్నదని ఉద్ఘాటించారు. తెలంగాణ మోడల్‌ను దేశప్రజలకు అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్కు అంకురార్పణ చేశారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు తన నియామకానికి స హకరించిన మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీవినోద్కుమార్, మేయర్ యాదగిరి సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో పాటు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఆపార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్ష, కార్యదర్శులు కులదీప్వర్మ, బోనకుర్తి సాయికృష్ణ, నాయకురాలు గంటల రేణుక ఉన్నారు.