మానకొండూర్, జూలై 17 : మలి వయసులో తోడుగా ఉన్న భర్త అనారోగ్యంతో చనిపోగా, ఆ వృద్ధురాలు తట్టుకోలేకపోయింది. రాత్రి నుంచి గుండెలవిసేలా రోదిస్తూ.. ఉదయం మృతదేహం వద్దే కుప్పకూలిపోయింది. గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోగా, కుటుంబంలో విషాదం నిం డింది. ఒకేసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తీ రని దుఃఖాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యుల క థనం ప్రకారం..
మానకొండూర్ మండలం కొం డపల్కల పంచాయతీ పరిధిలోని బంజేరుపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు తోట మల్లయ్య(77) మంగళవారం రాత్రి అనారోగ్యం తో మృతిచెందాడు. దీంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి (70) తట్టుకోలేకపోయింది. చనిపోయిన కాన్నుంచి గుండెలవిసేలా రోదించింది. బుధవారం ఉదయం మల్లయ్య దహనసంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండ గా..
మల్లయ్య మృతదేహం వద్ద రాజ్యలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చికిత్స కోసం తరలించడానికి 108కు సమాచారం ఇవ్వగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సిబ్బంది వచ్చి పరీక్షించి గుండెపోటుతో మృతి చెందినట్టు తెలిపారు. తొలిఏకాదశి పండుగ పూట వృద్ధ దంపతులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొన్నది. మధ్యాహ్నం మల్లయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.