సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 4: వివాహేతర సం బంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ఓ భార్య ప్రయత్నించింది. ఇది విఫలం కావడంతో ఇద్దరూ కలిసి పరారయ్యారు. భర్త ఫిర్యాదుతో నిందితులను పోలీసు లు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో వివరాలను సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ మంగళవారం వెల్లడించారు. తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ పరిధిలోని భరత్‌నగర్‌కు చెందిన చిట్యాల శైలజ(26) కు ఏడేళ్ల క్రితం బాలకృష్ణతో వివాహం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందిన వరుసకు మరిది అయిన చిట్యాల శ్రీకాంత్‌తో శైలజ పరిచయం పెంచుకొని అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. శైలజ, శ్రీకాంత్ తరుచూ ఫోన్లో మా ట్లాడుతుంటే భర్త అడ్డు చెప్పసాగాడు. వీరిద్దరూ కలుసుకునేందుకు భర్త అడ్డంకిగా మారడంతో ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు.
ఈ ఏడాది మార్చి 3న శైల జ, శ్రీకాంత్ కలిసి బాలకృష్ణకు పొలం వద్ద క రెంట్ షాక్ ఇచ్చి,హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు. బాలకృష్ణ రోజూ పొలానికి వెళ్లే సమయా న్ని అదునుగా చేసుకొని , కరెంట్ వైర్లు సహాయం తో షాక్ వచ్చి మృతిచెందేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదం నుంచి ఎలాగోలా బాలకృష్ణ భయటపడడంతో శైలజ, శ్రీకాంత్ భయంతో ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని బాలకృష్ణ తంగళ్లపల్లి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో హత్నాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శైలజ, శ్రీకాంత్ వరంగల్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి,రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.