కోరుట్ల, అక్టోబర్ 19: కోరుట్లలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. పల్లె, పట్టణాల్లో ధూం ధాం ప్రచారం చేస్తున్నది. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో శరవేగంగా వార్డులను చుట్టేస్తున్నది. అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లకూ మద్దతు పెరుగుతున్నది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. మీ వెంటే ఉంటామంటూ స్పష్టం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కలిసి గురువారం కోరుట్ల పట్టణంలో కలియదిరిగారు. అంతకుముందు అష్టలక్ష్మీ ఆలయంలో డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ఎమ్మెల్యే పూజలు చేసి, అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కోరుట్ల కొత్త బస్టాండు నుంచి పాత బస్టాండు మీదుగా నంది చౌరస్తా దాకా దుకాణాదారులు, వ్యాపారస్తులను ప్రత్యక్షంగా కలిసి బీఆర్ఎస్కు ఓటు వేసి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాపారస్తులు ఎమ్మెల్యే, సంజయ్‌కు స్వాగతం పలికారు. నుదుట తిలకం దిద్ది దుకాణంలోనికి ఆహ్వానించారు. కోరుట్ల పట్టణాభివృద్దికి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చేసిన కృషిని వా రు అభినందించారు. ఈ తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తన కొడు కు సంజయ్‌ని ఆదరించాలని ఎమ్మెల్యే కోరారు.
అభివృద్ధిని చూసి ఓటేయండి:
‘ఇన్ని రోజులు ప్రతిపక్ష నాయకులు ఎటు పోయారు. ఇటు వైపు కన్నెత్తి అయినా చూశా రా..? ఎన్నికలు వచ్చాయని మళ్లీ ప్రజల మధ్య కు వస్తూ, అలవికాని హమీలు ఇస్తూ ఓట్ల కోసం పాకులాడుతున్నరు. వారిని నమ్మితే మోసపోతమని’ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజ య్ కల్వకుంట్ల ప్రజలకు సూచించారు. సీఎం కేసీఆర్‌తోనే సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం రాక ముందు జరిగిన అభివృద్ధి, తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి మధ్య తేడాను గుర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ఎంపీపీ తోట నారాయణ, జిల్లా సర్పంచ్ల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, బీఆర్ఎస్ మైనార్టీ పట్టణాధ్యక్షుడు ఫహీం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కోరుట్లలో ఓ వైపు ప్రచారం చేస్తూనే, మరోవైపు ప్రజలకు వైద్య సేవలందిస్తూ ప్రజల మనసును చూరగొన్నారు సంజయ్ కల్వకుంట్ల. స్వతహాగా వెన్నెముక శస్త్ర నిపుణుడైన సంజయ్, ప్రచారం లో తన వద్దకు వచ్చిన పలువురి ఎక్స్‌రేలు పరీక్షించి అవసరమైన వారికి మందులు రాసిచ్చా రు. ఆరోగ్య నియమాలు పాటించాలని సూ చన లు చేశారు. బిజీ షెడ్యూల్లోనూ నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సంజయ్‌ని బాధితులు చల్లంగా ఉండాలని ఆశీర్వదించారు.