Whip Laxman Kumar | ధర్మారం, మే10: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం అకాల వర్షంతో తడవడంతో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యార్డును సందర్శించారు. ‘అకాల వర్షంతో ధర్మారం మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’ కథనం ప్రచురించింది. సమాచారం తెలుసుకున్న లక్ష్మణ్ కుమార్ సాయంత్రం మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన ధాన్యం ను పరిశీలించారు.
తడిసిన ధాన్యం కొనాలని బాధిత రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే ఫోన్లో జిల్లా మార్కెటింగ్ అధికారులు, జిల్లా సహకార అధికారితో మాట్లాడారు. తడిసిన ధాన్యం కొనాలని అధికారులను ఆయన ఆదేశించారు. ధాన్యం తడిసిన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పట్టి దాన్యమును కొంటామని లక్ష్మణ్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్లా నాయక్ తదితరులు ఉన్నారు.