Local elections | ఎల్లారెడ్డిపేట, ఆగష్టు 8: ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు బీఆర్ఎస్దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దుమాల, ఆల్మాస్ పూర్లో శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. ఇప్పటికే కాంగ్రేస్ పార్టీతో విసిగి తప్పు చేశామనే భావనలో ప్రజలు ఉన్నారని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వం పక్షాన సమస్యలు వచ్చినప్పుడు భరోసాగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు మనస్పర్తలు వీడి ఒక్కటిగా పని చేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారాపు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, నాయకులు పిల్లి కిషన్, గుల్లపల్లి నర్సింహారెడ్డి, గురిజాల కమలాకర్ రెడ్డి, బడే రమేష్, ములిగే ప్రమోద్, కొర్రి అనిల్, అజ్మీరా తిరుపతి నాయక్, మాలోత్ పూన్యనాయక్, బట్టు రాజు, చందర్రావు, శరవింద్, సూర్యం, కరోల్ల రాజు, బత్తిని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.