Godavarikhani | కోల్ సిటీ, జూలై 3: తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. స్థానిక రాంనగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఐఈసీ ప్రచారంలో భాగంగా పోస్టర్, స్టిక్కర్లను విడుదల చేశారు. కుక్క కాటు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రజలకు అవగాహన కోసం ఇంటింటికి అంటించారు.
తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆటోనగర్ వరకు రాజీవ్ రహదారి వెంట ఉన్న చెట్లు, ముళ్ల పొదలను తొలగించారు. పాత మునిసిపల్ కార్యాలయం ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంక్ పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ వార్డు అధికారులతోపాటు శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, కిరణ్, సీఓలు ప్రియదర్శిని, శమంతకమణి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్, ఎంఈఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.