First CM KCR | అంతర్గాం, జూన్ 21 : తొలి సీఎం కేసీఆర్ పాలనలో ప్రతీ ఇంటికి సంక్షేమం అందించి ప్రతీ ముఖంలో అనందం నింపారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల్లో శనివారం తెలంగాణకు కేసీఆర్ పాలన-శ్రీరామరక్ష కార్యక్రమంలో భాగంగా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పారుజ తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఎళ్లు పోరాటం సాగించి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా స్వరాష్టాన్ని సాధించి కారణజన్ములు కేసీఆర్ అని అన్నారు
. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని మహా సంకల్పంతో కాలేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా నిర్మాణం చేశారన్నారు. రైతులను రాజుల చేయాలని సంకల్పంతో రైతులకు ఉచితంగా రైతుబంధు, సకాలంలో ఎరువులు పంపిణీ చేసి రైతుల కళ్లలో ఆనందం నింపారని, 18 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులను అరిగొస పెడుతున్నరన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే అధికార పార్టీ నాయకులు తమ పనిగా పెట్టుకున్నారని, ప్రజా సంక్షేమాన్ని మరిచారని మండిపడ్డారు. రైతులకు కేసీఆర్ పాలనలో సకాలంలో పెట్టుబడి సహాయం కింద రైతు బంధు అందించేవారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు రైతుబంధు వేస్తున్నారని విమర్శించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలని, కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతర్గాం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొల సంతోష్ గౌడ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి, మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ, బండారి ప్రవీణ్, కొల్లూరి సత్య, సతీష్, మెరుగు పోశం గంగాధరి, రాములు, ధరణి, రాజేష్, సతీష్, సందెల మల్లయ్య, అర్శన పల్లి శ్రీనివాస్, నిమ్మరాజుల రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.