రాయికల్ : రాయికల్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ( Maize ) ధాన్యం కేంద్రాన్ని మాజీ మంత్రి , బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి( Jeevan Reddy ) పరిశీలించారు.
మార్కెట్‌కు 40వేల క్వింటాళ్ల ధాన్యం రాగా కేవలం 20వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై సంబంధిత జిల్లా అధికారి, మార్కుఫెడ్ ఎండీ, డీఎంతో ఫోన్ లో మాట్లాడారు .
తూకం వేసి ధాన్యం తరలింపునకు లారీలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. లారీలు రోజుకు కనీసం 4 వస్తేనే ధాన్యం తూకం కాదని పేర్కొన్నారు. అధికారులు రైతుల ఆందోళనపై స్పందించపోవడం దారుణమన్నారు. గోదాముల కేటాయింపు, లారీల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు.
జగిత్యాల మార్కెట్లో వెజ్, నాన్ నాన్ వెజ్ మార్కెట్ గోదాములు అందుబాటులో ఉన్నా వాటిని వినియోగించుకోక పోవడం విచారకరమన్నారు. మార్కెట్ గోదాములను కాంట్రాక్టరు తన అవసరాలకు వాడుతున్నారని విమర్శించారు. గోదాములు ఎక్కడ ఇచ్చిన ధాన్యం రవాణా చేయాలని జీవన్ రెడ్డి సూచించారు . ఆయన వెంట జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరన్ రావు , మున్సిపల్ చైర్మన్ రవి , యువజన నాయకుడు తాటిపర్తి సీకే రెడ్డి , నాయకులు పాల్గొన్నారు.