Weather Day | జ్యోతినగర్(రామగుండం), జనవరి 16: భారత వాతావరణ శాఖ 151వ దినోత్సవాన్ని పురస్కరించుకోని గురువారం సాయంత్రం రామగుండంలోని భారత వాతావరణ కేంద్రంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అధికారులు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా వాతావరణ కేంద్రంలో ఉన్న యంత్రాలు, పరికరాలు, వాటి పనితీరు, కలిగే ఉపయెగాలు, ఉష్ణోగ్రతల నమోదుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాతావరణ కేంద్రం ఇన్చార్జి అభినవ్ జైన్, సైంటిఫిక్ అసిస్టెంట్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.