Veenavanka | వీణవంక, మార్చి 23 : గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, ఇందుకోసం ప్రభుత్వం మై భారత్ కరీంనగర్ అనే కార్యక్రమం తీసుకుందని జిల్లా యువజన సంఘాల అధికారి వెంకట్ రాంబాబు అన్నారు. మల్లారెడ్డిపల్లిలో ఆయన యువకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
యువజన సంఘాలు లేని ప్రాంతాలలో నూతన సంఘాలను ఏర్పాటు చేసి వారిని మై భారత్ కరీంనగర్ జిల్లా విభాగాలకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్లో మై భారత్ నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గ్రామీణ యువత చురుగ్గా పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజర్ కర్రె నాని యాదవ్, సమ్మయ్య, రాజయ్య, భిక్షపతి, రవి, స్వామి, శ్రీనివాస్, గణేష్, కుమార్, హరీష్, ప్రశాంత్, అభిలాష్, అఖిల్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.