Yadava Sangam | సారంగాపూర్, సెప్టెంబర్ 1: సభ్యత్వాలతో గ్రామగ్రామాన యాదవుల్లో రాజకీయ చైతన్యం తీసుకోస్తామని యాదవ సంఘం ఆడహక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మండలంలోని పోతారం గ్రామంలో యాదవులతో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ సంఘాన్ని జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసి యాదవ హక్కులను సాధించుకుంటామన్నారు. యాదవుల సమస్యల పరిష్కారానికి, యాదవ సంఘం బలలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో సమస్యలు, హక్కులు తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం యాదవ సంఘం సభ్యత్వాలు నమోదు చేసి 48 మందికి రసీదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ఏడుమల మల్లేష్, పన్నాల ఐలయ్య, అంకూస్, రవి, బాపన్న, కొమురయ్య, లావణ్య, కొమురక్క, శంకరవ్వ, పద్మ, అమృత, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.