Vemulawada | వేములవాడ రూరల్, జూన్ 25: వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ మైసయ్య కు చెందిన ఇల్లు షార్క్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధం కాగా వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా చలిమడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్య పడవద్దని భరోసా కల్పించారు.
ఇల్లు మొత్తం పూర్తిగా కాలిపోవడంతో రాజవ్వ కుటుంబ పరిస్థితి బాగాలేదని తన వంతుగా ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ సర్పంచులు ఏశ తిరుపతి, మల్లేశం, జంకె శ్రీనివాస్ రెడ్డి, తీగల శ్రీనివాస్, పసుల అంజి తో పాటు తదితరులు ఉన్నారు.