Congress Attack | కాంగ్రెస్ అరాచక పాలన అంతు చూస్తాం : జడ్పీ మాజీ చైర్పర్సన్
Congress Attack | రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాలు అధికార మదంతో చేసిన దాడిని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ తీవ్రంగా ఖండించారు.
జగిత్యాల : రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాలు ( Congress Goons ) అధికార మదంతో చేసిన దాడిని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ( Dava Vasanta ) తీవ్రంగా ఖండించారు.ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అరాచక పాలన అంతు చూస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా రౌడీల రాజ్యంగా మార్చేశారని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ను ఎవరూ చెదిపేయలేరని అన్నారు. పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి కాంగ్రెస్కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు.
దాడులకు పాల్పడుతున్న మూకలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. చిల్లర దాడులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ అని, కేసీఆర్ సైనికులుగా ప్రజల పక్షాన సమస్యల పట్ల పోరాడుతామని వెల్లడించారు. ఈ సమావేశంలో జగిత్యాల రూరల్, అర్బన్ మండల అధ్యక్షులు అయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, పాక్స్ మాజీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కమలాకర్ రావు, ఎల్లా రాజన్న, హరీష్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

